తొమ్మిది అవినీతి కేసుల్లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్

  • అజిత్ పవార్ కు క్లీన్ చిట్ ఇచ్చిన ఏసీబీ
  • మండిపడ్డ శివసేన, కాంగ్రెస్
  • ఇదంతా క్విడ్ ప్రోకోలో భాగమేనని ఆరోపణ
బీజేపీతో చేయి కలిపి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు రెండు రోజుల్లోనే ఊరట లభించింది. తొమ్మిది అవినీతి కేసుల్లో ఆయనకు క్లీన్ చిట్ లభించింది. నీటిపారుదల ప్రాజెక్టులో 70 వేల కోట్ల అవినీతి జరిగిందన్న కేసును కూడా మూసేశారు. ఈ సందర్భంగా ఏసీబీకి చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, అజిత్ పవార్ పై ఎలాంటి అవినీతి కేసులు లేవని తెలిపారు.

మరోవైపు, ఈ కేసుల్లో అజిత్ పవార్ కు క్లీన్ చిట్ రావడంపై శివసేన, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. ఇదంతా క్విడ్ ప్రోకోలో భాగమేనని ఆరోపించాయి. కేసులను దృష్టిలో ఉంచుకునే బీజేపీకి అజిత్ పవార్ మద్దతిచ్చారని... ఇదంతా డీల్ లో భాగమేనని విమర్శించాయి.
Go Back to Shorts
Ajit Pawar
NCP
Corruption Cases
ACB
Maharashtra

More Telugu News